Stock Market: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు.. ఈ స్థిరత్వం కొనసాగుతుందా?

Stock Market: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు.. ఈ స్థిరత్వం కొనసాగుతుందా?

ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ ( గురువారం, ఫిబ్రవరి 13) ఫ్లాట్ గా ముగిశాయి. వరుసగా ఆరు సెషన్లలో తీవ్ర నష్టాలను మిగిల్చిన మార్కెట్లు ఇవాళ స్తబ్దుగా కొనసాగాయి. ఇవాళ్టి సెషన్ లో నిఫ్టీ50 స్వల్పంగా 13.85 పాయింట్లు నష్టపోయి 23,031.40 దగ్గర ముగిసింది. అదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 32.11 పాయింట్లు డౌన్ లో 76,138.97 దగ్గర క్లోజ్ అయ్యింది. 

బుధవారం సెషన్ లో తీవ్ర నష్టాలతో 22,800 సపోర్ట్ దగ్గరకు వెళ్లి కీలక రెసిస్టెన్స్ 23,000 పైన ముగిసిన నిఫ్టీ.. అదే సపోర్ట్ ను రెస్పెక్ట్ చేస్తూ ఇవాళ ఎగువన క్లోజ్ అయ్యింది. ఇవాళ్టి ట్రేడింగ్ సెషన్ లో ఫార్మా షేర్లు పాజిటివ్ గా క్లోజ్ అవ్వగా.. ఐటీ, పీఎస్ యూ (పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు) నిఫ్టీని కిందికి లాగాయి. టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాబ్ ఫైనాన్స్, ఫిన్ సర్వ్, సిప్లా మొదలైనవి టాప్ గెయినర్లు కాగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటార్ కార్ప్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, మొదలైనవి టాప్ లూజర్లు.

ఓపెనింగ్ నుంచి పాజిటివ్ గా లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. ఇవాళ ఎక్స్ పైరీ కావడంతో హెవీ వెయిట్స్ లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్స్ తో నిఫ్టీ ఫ్లాట్ గానే ముగిసింది. ఫార్మా, మెటల్, రియాలిటీ సెక్టార్స్ లాభాల్లో ముగియగా.. ఐటీ, ఎఫ్ఎమ్ సీజీ స్టాక్స్ లగార్డ్ గా నిలిచాయి. 

ఈ స్థిరత్వం కొనసాగేనా..?

ఫిబ్రవరి 4 నుంచి వరుసగా ఆరు సెషన్లలో తీవ్ర నష్టాలతో కొనసాగుతున్న మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. ఓపెనింగ్ లో వచ్చిన బయ్యింగ్ చూసి.. ఇది మార్కెట్లకు పాజిటివ్ సైన్ అవుతుందా.. ఇక నుంచి పెరుగతాయా తగ్గుతాయా అనే సస్పెన్స్ ప్రతి ఇన్వెస్టర్ లో ఉంది. 

ALSO READ | లోక్‌సభలో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు: మార్పులు, చేర్పులు ఇవే

అయితే ఫారెన్ ఇన్వెస్టర్లు (FII) ఇండియన్ మార్కెట్ నుంచి భారీగా అమ్ముతూ ఉండటం మైనస్. అదే విధంగా ట్రంప్ టారిఫ్ భయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెసిప్రోకల్ ట్యాక్స్ (యూఎస్ పై ఎంత ట్యాక్స్ విధిస్తే తిరిగి ఆయా దేశాలపై అంతే ట్యాక్స్ విధించడం) విధిస్తానని హెచ్చరించడం కూడా మార్కెట్లలో ఆందోళన క్రియేట్ చేసింది. అయితే యూఎస్ పై వేసే పన్నులను తగ్గించుకోవడానికి భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కానీ యూఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా గురువారం ట్రంప్ ను కలవనున్నారు. ఈ మీటింగ్ చాలా కీలకం. ఈ మీటింగ్ సందర్భంగా టారిఫ్ లపై ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఇరు దేశాల ఎకానమీకి ఉపయోగపడే విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటే అది ఇండియన్ మార్కెట్లకు పాజిటివ్ కావచ్చు. చూడాలి మరి.. మోదీ-ట్రంప్ మీటింగ్ ఔట్ కమ్ ఎలా ఉంటుందో.