స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాలు

స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాలు
  • సెన్సెక్స్ 808.65 పాయింట్లు డౌన్​
  • నిఫ్టీ 235.50 పాయింట్లు పతనం

ముంబై: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణలు, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోల కారణంగా స్టాక్ మార్కెట్లు వరుసగాఐదో రోజూ పడ్డాయి.  ఇన్వెస్టర్లు రూ. 16.2 లక్షల కోట్లు కోల్పోయారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, ఆటో, ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్ 808 పాయింట్లు పతనమయింది.  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ఎఫ్​ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది.   బీఎస్​ఈ సెన్సెక్స్ 808.65 పాయింట్లు పతనమై మూడు వారాల కనిష్ట స్థాయి 81,688.45 వద్ద స్థిరపడింది.  ఇంట్రాడేలో కనిష్టంగా 81,532.68 స్థాయిని,  గరిష్టంగా 83,368.32 స్థాయిని తాకింది.  

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 235.50 పాయింట్లు క్షీణించి 25,014.60 వద్దకు చేరుకుంది. ఇంట్రా-డేలో, ఇది కనిష్టంగా 24,966.80 స్థాయిని,  గరిష్టంగా 25,485.05 స్థాయిని తాకింది.  ఈక్విటీల్లో ఐదు రోజుల భారీ కరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్లు రూ.16.26 లక్షల కోట్ల మేర నష్టపోయారు. గత శుక్రవారం నుంచి ఐదు రోజుల్లో బీఎస్​ఈ- లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,26,691.48 కోట్లు క్షీణించి రూ.4,60,89,598.54 కోట్లకు (5.49 ట్రిలియన్ డాలర్లు) పడింది. వారంలో సెన్సెక్స్ 3,883.4 పాయింట్లు లేదా 4.6 శాతం  నిఫ్టీ 1,164.35 పాయింట్లు లేదా 4.5 శాతం మేర పడిపోయాయి.