
ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు..అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధించారని ప్రకటించడంతో మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చైనా సహా ఇతర దేశాలు కూడా తమ టారిఫ్ నిర్ణయాలను ప్రకటించడంతో, భారతీయ స్టీల్ కంపెనీలకు
గట్టి దెబ్బ తగిలింది. డాలరుతో పోలిస్తే భారత రూపాయి 87.92 స్థాయికి చేరి ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. డాలర్ బలపడటంతో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించు
కోవడం ప్రారంభించారు.
మార్కెట్‌పై ఆర్బీఐ చర్యల ప్రభావం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేపట్టిన తాజా చర్యలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఆర్బీఐ ఇటీవల
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, మార్కెట్‌లో తగినంత లిక్విడిటీ అందించలేకపోయింది. మరోవైపు,
10- ఇయర్ ప్రభుత్వ బాండ్ యీల్డ్ 6.83% స్థాయికి పెరగడం, పెట్టుబడిదారులు స్టాక్స్‌కు బదులుగా సేఫ్ బాండ్‌లను ఎంచుకునేలా చేసింది.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు ఈ మార్కెట్ పతనంలో ప్రధాన బాధితులుగా మారాయి. PSU బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్ పుంజుకోవాలంటే, విదేశీ పెట్టుబడిదారుల మళ్లీ ప్రవేశం, రిజర్వు బ్యాంక్ మరింత సహాయక చర్యలు తీసుకోవడం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం అవసరం. అమెరికా దుందుడుకు వాణిజ్య విధానాలు, మరోవైపు రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, స్టీల్ అండ్ బ్యాంకింగ్ రంగాల నష్టాలు అని చెప్పొచ్చు. భవిష్యత్తులో మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుందనేది ప్రధానంగా డాలర్ మారకపు విలువ, కేంద్ర బ్యాంక్ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
- శ్రీనివాస్ గౌడ్ ముద్దం-