​స్టాక్​మార్కెట్ల స్కాంకు మోదీ, అమిత్​ షా పాల్పడ్డారు: రాహుల్​ గాంధీ

​స్టాక్​మార్కెట్ల స్కాంకు మోదీ, అమిత్​ షా పాల్పడ్డారు: రాహుల్​ గాంధీ

ప్రధాని మోదీపై రాహుల్​ గాంధీ విరుచుకుపడ్డారు. 20 కోట్ల మంది భారతీయులు స్టాక్​ మార్కెట్లపై ఇన్వెస్ట్​ చేశారన్న ఆయన... స్కాక్​ మార్కెట్ల స్కాంపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ డిమాండ్​ చేశారు.  జూన్​ 3న స్టాక్​ మార్కెట్లు స్టాక్​ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈవి షయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు.  ఇది స్టాక్​ మార్కెట్లో అత్యంత పెద్ద స్కాం అన్నారు. స్టాక్​ మార్కెట్ల విషయంపై మొదటిసారిగా ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్​ షా తమ విధులను దుర్వినియోగం చేశారన్నారు.  జూన్​ 3 పెరిగిన స్టాక్​ మార్కెట్లు.. జూన్​ 4న పడిపోయాయన్నారు.  ఎన్నికల అనంతరం మీడియా తప్పుడు ఎగ్జిట్​ పోల్స్​ ఇచ్చే విషయంలో మోదీ ప్రమేయం ఉందని రాహుల్​ గాంధీ అన్నారు.  

ఫారెన్​ ఇన్వెస్టర్లకు .. ఎగ్జిట్​ పోల్స్​కు ఏమైనా సంబంధం ఉందా.. ఎగ్జిట్​ పోల్స్​ చేసిన వారికి బీజేపీతో సంబంధం ఉందా.. స్కాక్​ మార్కెట్ల పడిపోవడంతో ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్లు నష్టపోయారన్నారు.  బీజేపీ ఇంటర్నల్​ సర్వేలో 220 సీట్లు వస్తాయని ముందే వారికి తెలుసన్నారు.  ఎన్నికల తరువాత షేర్లు పెరుగుతాయని ప్రధానిమోదీ, హోం మంత్రి అమిత్​ షా పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు.