మళ్లీ 80 వేలపైకి సెన్సెక్స్​

 మళ్లీ 80 వేలపైకి సెన్సెక్స్​
  • 445 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్​
  •  నిఫ్టీ 145 పాయింట్లు అప్​

ముంబై:  బ్లూచిప్ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్,  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌ల షేర్లలో కొనుగోళ్లతో పాటు అమెరికా మార్కెట్లు పెరగడంతో బెంచ్‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.29 పాయింట్లు పెరిగి 80,248.08 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్టంగా 80,337.82 వరకు వెళ్లింది.  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 144.95 పాయింట్లు పెరిగి 24,276.05 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్​లో అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్​డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టైటాన్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్  రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడ్డాయి. 

బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్ 1.05 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్ 0.84 శాతం ఎగబాకాయి.  సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌లలో   యుటిలిటీస్  బ్యాంకెక్స్ మాత్రమే వెనకబడ్డాయి.   ఆసియా మార్కెట్లలో సియోల్ నష్టాల్లో, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాల్లో ముగిశాయి.  ఐరోపా మార్కెట్లు చాలా వరకు దిగువన ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ఎఫ్‌‌‌‌ఐఐలు శుక్రవారం రూ. 4,383.55 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, డీఐఐలు రూ.5,723.34 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.