ప్రపంచంలోని ఇతర దేశాలలో ఉన్న ప్రతికూల వాతావరణం మధ్య ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 623 పాయింట్లు నష్టపోయి 81,244 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 24,821 వద్ద ట్రేడవుతోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.73 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల వాతావరణం కారణంగానే మార్కెట్ డౌన్ అయినట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడి పెట్టకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలిపారు.