వన్డేలకు స్టోయినిస్‌‌ గుడ్‌‌‌‌బై.. చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీకి కమిన్స్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్ దూరం

వన్డేలకు స్టోయినిస్‌‌ గుడ్‌‌‌‌బై.. చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీకి కమిన్స్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్ దూరం

మెల్‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ప్రతిష్టాత్మక చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగా వన్డే కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం వీడ్కోలు పలికాడు. అయితే టీ20ల్లో కొనసాగుతానని తెలిపాడు.  ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 టోర్నీలో డర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆడుతున్న స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.  

వన్డే కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పడం వెనుక ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు. ‘ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున వన్డే క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నీ అద్భుతంగా సాగింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. దేశం తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడినందుకు గర్వంగా ఉంది. రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయం చిన్న విషయం కాదు. కానీ వన్డేలకు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం’ అని స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. మరోవైపు కెప్టెన్ ప్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ నుంచి వైదొలిగారు. 

చీలమండ గాయం నుంచి కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాలిపిక్క నొప్పి నుంచి హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా కోలుకోలేదు. వెన్ను నొప్పితో మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుగానే టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నలుగురు కీలక ప్లేయర్లు టోర్నీకి దూరం కావడంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.