స్టోక్స్ కెప్టెన్సీ అంటే మాటలా: బ్యాటర్ ఎదురుగా 6 మంది ఫీల్డర్లు

స్టోక్స్ కెప్టెన్సీ అంటే మాటలా: బ్యాటర్ ఎదురుగా 6 మంది ఫీల్డర్లు

టెస్టు మ్యాచ్ అనగానే మన కళ్ల ముందు కదలాడేది రైలు బండిలాంటి స్లిప్‌ ఫీల్డర్లు. ఎడ్జ్‌ తీసుకొని వచ్చే క్యాచ్‌ల కోసం.. నలుగురు నుంచి ఐదుగురు ఫీల్డర్లు స్లిప్‌లో నిల్చొని ఉంటారు. ఇలాంటి సీన్లు ప్రతి టెస్ట్ మ్యాచులోనూ కనపడుతుంటాయి. మరి పిచ్‌కు ఇరువైపులా అడ్డుగోడలా 6 మంది ఫీల్డర్లు నిలబడటం ఎప్పుడైనా చూశారా? చూసుండరు. అలాంటి సీన్‌కు ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న యాషెస్ సిరీస్ వేదికైంది. 

ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడానికి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ వినూత్నంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఏకంగా ఆరుగురు ఫీల్డర్లను స్లిప్ ఫీల్డర్లను నిలబెట్టినట్లు బ్యాటర్‌కు ఎదురుగా నిలబెట్టాడు. దీంతో ఖవాజాకు ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ ఇరువైపులా షాట్లు ఆడే వీల్లేకుండా చేశాడు. ఈ ఫీల్డింగ్ చూసి బిత్తరపోయిన ఖవాజా.. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని  అందురూ సమర్థిస్తుండటం గమనార్హం. స్టోక్స్ కెప్టెన్సీ అంటే ఈమాత్రం ఉండాలే అని పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
 

This is Test cricket. Unlike what the Indian team can ever do. Brilliant captaincy from Ben Stokes. #Ashes23 #Ashes2023 #ENGvAUS #UsmanKhwaja pic.twitter.com/SNaCKwojHx

— Kunal (@kunaljoshi93) June 18, 2023