వ్యవసాయ పొలాల్లో మోటార్లకు ఉన్న కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరు దొంగలను స్థానిక రైతులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేశారు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వెల్గటూర్ మండలం కోటిలింగాల వ్యవసాయ పొలాల్లో పట్టపగలు వ్యవసాయ మోటార్లకున్న కాపర్ వైర్లను దొంగిలిస్తున్న సమయంలో పట్టుకున్నారు.
.దీంతో మరోసారి ఇలా చేయమని దొంగలు రైతుల కాళ్లు పట్టుకున్నారు. ఇంకెప్పుడు ఇలా చేయమని బ్రతిమిలాడారు. దీంతో వారు పోలీసులకు అప్పగించారు. వీళ్లు వెల్గటూర్ గ్రామ శివారులో డేరాలు వేసుకొని ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజుల క్రితం కోటిలింగాల, పాశిగామ, మోక్కట్రావుపేట్ గ్రామాల్లోని సుమారు 25 మంది పంట పొలాలకు వేసుకున్న కాపర్ వైర్ల చోరీ అయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.