
- 10 తులాల గోల్డ్.. రూ. 40 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు
పెద్దపల్లి, వెలుగు: గోల్డ్ షాపులో దొంగలు పడి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. పెద్దపల్లి టౌన్ పైడా బజార్ విశ్వకర్మ వీధిలో దేవరకొండ కరుణాకర్ గోల్డ్ షాపులో సోమవారం అర్ధరాత్రి దాటాక తాళాలు పగలగొట్టి లాకర్లలోని 10 తులాల గోల్డ్, రూ. 40 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం షాపు తీసిన కరుణాకర్చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్వెళ్లి పరిశీలించారు. సీసీ కెమెరాలో చోరీకి పాల్పడినది మహిళగా పోలీసులు అనుమానిస్తూ.. క్లూస్‌టీమ్ తో విచారణ స్పీడప్ చేశారు. కాగా అంతకుఋముందురోజే కొందరు మహిళలు అదే ఏరియాలోని మరో గోల్డ్ షాపులో నగలు కొనడానికి వెళ్లి హడావుడి చేసి చేతికి అందిన 30 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లిపోయారు. మరుసటి రోజే ఘటన జరగడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.