- ధ్వంసమైన దేవుడి విగ్రహం
- ఆరుగురు మైనర్లు సహా 34 మంది అరెస్ట్
- నిందితుల వర్గానికి చెందిన 300 మంది పోలీస్ స్టేషన్ ముట్టడి
- లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
గాంధీనగర్:వినాయక చవితి పండగ వేళ గుజరాత్‌లో కొందరు అల్లర్లకు తెరతీశారు.సూరత్ సిటీలోని సయ్యద్‌పురా ఏరియాలో స్థానికులు నిర్మించుకున్న వినాయ కుని మండపంపై ఆదివారం అర్ధరాత్రి కొంతమంది మైనర్లు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో గణేశ్ విగ్రహం ధ్వంసమైంది. స్థానికుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు మైనర్‌లను అదుపులోకి తీసుకుని లాల్‌గేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
యితే, తమకమ్యూనిటీకి చెందిన మైనర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారని.. ఓ వర్గానికి చెందిన 200 నుంచి-300 మందితో కూడిన గుంపు పోలీస్ స్టేషన్ ను ముట్టడిం చింది. నిరసనకారులు రెండు పోలీస్ వెహికల్స్ తగలబెట్టారు. అక్కడ పార్క్ చేసిన మరో రెండు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపైకి రాళ్లు రు వ్వడంతో వారు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు.
రెండు ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు మైనర్లను, మరో28 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.
ధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని విడిచిపెట్టబోమన్నారు. ఈ ఘటన సూరత్‌లోని మతపరంగా సున్నితమైన ప్రాంతంలో జరిగిందన్నారు. ఆరుగురు మైనర్లు మండపంపై కావాలనే రాళ్లు రువ్వినట్లు చెప్పారు. వారిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా చూసేందుకు పోలీసులు సన్నద్ధంగా ఉన్నారని చెప్పారు.