
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ కంపెనీ స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ తమ వుడ్స్ శంషాబాద్ ప్రాజెక్టు వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటరింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. దీనివల్ల గాలి నాణ్యత ఎలా ఉందో తెలుస్తుంది. పర్యావరణ స్థిరత్వం గురించి అవగాహన పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని స్టోన్‌క్రాఫ్ట్ తెలిపింది.
ఈ కార్యక్రమంలో స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మాటేజా వోడెబ్ ఘోష్, స్లోవేనియా రిపబ్లిక్ ఆర్థిక సలహాదారు టీ పిరిహ్, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అదనపు కమిషనర్ సుభద్రా దేవి (ఐఎఫ్ఎస్) పాల్గొన్నారు.