హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ లగ్జరీ అసిస్టెడ్ లివింగ్ ప్రాజెక్ట్‌తో అసిస్టెడ్ లివింగ్ (సీనియర్ సిటిజన్స్ కోసం) విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ సమీపంలో యాదగిరి గుట్టలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్ట్ సీనియర్ సిటిజన్లకు సకల సౌకర్యాలు అందించనుంది.
ఇది హైదరాబాద్‌లో అతిపెద్ద అత్యంత విలాసవంతమైన/ప్రీమియం సీనియర్ సిటిజన్స్ లివింగ్ ప్రాజెక్ట్‌గా నిలువనుందని కంపెనీ తెలిపింది. ఎయిమ్స్, యాదగిరిగుట్ట ఆలయం వంటి సదుపాయాలు ఉన్నందున ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నామని స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్ కీర్తి చిలుకూరి చెప్పారు. కంపెనీ గతంలో హైదరాబాద్‌లో మిలియన్ చదరపు గజాల ప్లాట్ డెవలప్‌మెంట్‌లతో పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి మియావాకీ ఫారెస్ట్ వుడ్స్ వంటి ప్రాజెక్ట్‌లను నిర్మించిందని వివరించారు.