తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి

ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. 

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు చేసుకోగా.. సీఐ మురళీకష్ణ తలకి గాయాలయ్యాయి. టీడీపీ నేత సూర్యముని  ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో సీఐకి గాయాలయ్యాయి.  కాలేజీ గ్రౌండ్​ లో ఉన్న ఓ పోలీస్​ ఉన్నతాధికారి అస్వస్థతకు గురికావడంతో ... ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన  వైసీపీకి చెందిన ఓ కార్యకర్త పరిస్థితి విషమంగా ఉంది.  పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు పలుమార్లు బాష్ప వాయువును ప్రయోగించారు.  అయినా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. 

 జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద  వైసీపీ నేతలను అడ్డుకోడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకుంటున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అనుచరులు దూసుకుపోతున్నారు. దాడులను అడ్డుకోవడానికి పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర టెన్షన్ నెలకొంది.