సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపు ఆపండి : కృష్ణా బోర్డు

సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపు ఆపండి : కృష్ణా బోర్డు
  • ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ కుడి కాలువ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇప్పటికే కేటాయింపులకు మించి నీటిని తరలించుకుపోయారని, వెంటనే తరలింపు నిలిపివేయాలని సూచించింది. ఈ మేరకు బోర్డు ఎస్ఈ  అశోక్​కుమార్..​ ఏపీ ఈఎ న్సీ నారాయణరెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ఏపీ ఇప్పటికే ఎక్కువ నీటిని తరలించుకుపోయిందన్న తెలంగాణ ఫిర్యాదు మేరకు నీటి తర లింపు ఆపాలని తాము గతంలోనే లేఖ రాశామని అశోక్  గుర్తు చేశారు.

మార్చి పదో తేదీ నుంచి రోజుకు 9వేల క్యూసెక్కుల చొప్పున ఇప్పటి దాకా 11 టీఎంసీ లను కుడి కాలువ నుంచి ఏపీ తర లించిందని తెలిపారు. సాగర్​ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పథకంపై ఆధారపడిన 8లక్షల ఎక రాల ఆయకట్టుతో పాటు హైదరాబాద్​లో వాటర్​ ప్రాబ్లమ్​ వస్తుందన్నారు.