
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామస్తులు సోమవారం పోతారంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని కంపెనీ బోర్డు తొలగించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు మహిళలు ఫ్యాక్టరీ వల్ల పొలాలన్ని నాశనం అవుతాయని వెంటనే దీనిని ఆపివేయాలని పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. పది రోజుల తర్వాత ఫ్యాక్టరీ యజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.