పొగాకులో మనకు హాని చేసే 300 రకాల పదార్థాలున్నాయని సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. అందులో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ అత్యంత ప్రమాదకరమైనవని తేల్చారు. వీటివల్ల సడెన్ డెత్ సంభవించవచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా మానడం కష్టంగా ఉందా? అయితే ఇవి ట్రై చేయండి.. వెంటనే కాకపోయినా కొన్నిరోజులకు స్మోకింగ్ ను వదిలేస్తారు.
- పచ్చని ఆకు కూరలు : పొగతాగడం వల్ల శరీరంలో విటమిన్ -సి తగ్గిపోతుంది. దానిని భర్తీ చేసేందుకు ఈ గ్రీన్ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా తినాలి.
- సిట్రస్ పండ్లు : ఒత్తిడి ఎక్కువైనప్పుడే స్మోకింగ్ చేస్తారు. అయితే నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్ -సి ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుంది. ఆరెంజ్, మొసంబి తింటే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
- క్యారెట్ జ్యూస్ : పొగతాగిన తర్వాత అందులోని నికోటిన్ మూడు రోజుల వరకు శరీరంలో అలాగే నిల్వ ఉంటుంది. శరీరంలో నికోటిన్ ఎక్కువైతే చర్మసౌందర్యం దెబ్బతింటుంది. విటమిన్-ఎ,బి,సి, కెలు శరీరం లోని నికోటిను బయటకుపంపించేస్తాయి. అయితే ఈ విటమిన్లు క్యారెట్ లో ఎక్కువగా ఉంటాయి. అందుకే పొగతాగేవారు క్యారెట్ జ్యూస్ తాగాలి.
- ఎర్రదానిమ్మ గింజలు : ఎర్రని దానిమ్మ గింజలు తినడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అంతే కాదు దానిమ్మ గింజలు పొగ తాగాలనే ఆలోచనను తగ్గిస్తాయట.
- నీళ్లు : సిగరెట్ తాగలనిపించినప్పుడు ఓ గ్లాస్ నీళ్లు తాగితే స్మోకింగ్ చేయాలన్న ఆలోచన తగ్గుతుందని తేలింది. పైగా నీళ్లు శరీరంలోని అనవసరమైన వాటిని, విషపదార్ధాలను బయటకు పంపుతాయి