హంద్రీ-నీవా విస్తరణ ఆపండి

  • కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం తాజా లేఖ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం విస్తరణ పనులు వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)  చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోకుండానే  హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విస్తరణ పనులకు టెండర్లు పిలిచిందని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాతపథకమేనంటూ  విస్తరణ పనులకు సన్నాహాలు చేస్తోందని, ఈ పనులు వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేశారు.