యాదాద్రి, వెలుగు: ట్రిపుల్ఆర్సర్వే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన బాధితులు సోమవారం కలెక్టరేట్ఎదుట ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్ఆర్వల్ల పచ్చటి వ్యవసాయ భూములను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. నాగండ్లు, పాల క్యాన్లు, పచ్చటి గడ్డితో హైవేపై రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట పాలు పారబోస్తూ నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల రీజినల్రింగ్రోడ్డు కోసం తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి, వలిగొండ, చౌటుప్పల్తదితర 23 గ్రామాల్లో 1,853.04 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రాయగిరి పరిధిలో సెంట్రల్వస్తుండడం వల్ల ఈ ఒక్క గ్రామంలోనే 70 మందికి పైగా రైతులు 266.14 ఎకరాలను కోల్పోతున్నారు.
గతంలోనూ వివిధ ప్రాజెక్టుల పేరుతో భూములు కోల్పోవడంతో రైతులు నిరంతరంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ సర్వేను అడ్డుకుంటున్నారు. కలెక్టరేట్ ఎదురుగా పలుసార్లు ఆందోళన చేసినా.. కలెక్టర్పమేలా సత్పతి నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో న్యాయం చేయాలంటూ సోమవారం మరోసారి ఆందోళనకు దిగారు. హైదరాబాద్–- వరంగల్రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లి బైఠాయించారు. చివరకు ప్రజావాణిలో ఉన్న కలెక్టర్‌ను కలిసి సర్వే నిలిపి వేయించాలని కోరారు. ప్రభుత్వానికి మీ ఆవేదన తెలుపుతామంటూ కలెక్టర్హామీ ఇచ్చారు. గతంలోనూ ఇదే విధంగా హామీ ఇచ్చారని, కానీ సర్వే అపడం లేదంటూ బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందించారు.