
పాట్నా: బిహార్ యంగ్ క్రికెటర్ సాకిబుల్ గని రికార్డు సృష్టించాడు. మిజోరం జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల గని.. ట్రిపుల్ సెంచరీ చేశాడు. 405 బంతుల్లో 341 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంట్లో రెండు సిక్సులు, 56 ఫోర్లు ఉన్నాయి. అరంగేట్ర మ్యాచులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన ప్లేయర్ గా ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో గతంలో మధ్య ప్రదేశ్ ఆటగాడు అజయ్ రోహెరా పేరిట ఉన్న రికార్డును గని బ్రేక్ చేశాడు. అంతకు ముందు 2018–2019 రంజీ ట్రోఫీ సీజన్‌లో రోహెరా 267 పరుగులు సాధించాడు. ఫస్ట్ మ్యాచులోనే సత్తా చాటిన గనిని భారత దిగ్గజ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ మెచ్చుకున్నాడు. భవిష్యత్ లోనూ గని ఇలాగే రాణించాలన్నాడు.
Congratulations to Sakibul Gani for a solid performance in his debut Ranji Trophy match.
— Sachin Tendulkar (@sachin_rt) February 19, 2022
Keep it up. https://t.co/B7C7cF7mwL
ఇక, ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 686 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. సాకిబుల్ గనికి తోడుగా బాబుల్ కుమార్ కూడా రాణించాడు. నాలుగో వికెట్‌కు ఆ ఇద్దరూ కలసి 538 రన్స్ జోడించారు. బాబుల్ 229 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన మిజోరం.. ప్రస్తుతం మూడు వికెట్లకు 201 పరుగులు చేసింది. తరువార్ కోహ్లీ (115 నాటౌట్), ఉదయ్ కౌల్ (72 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం: