తయారీ లైసెన్సులు రద్దయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని 5,606 ఫ్రాంచైజీ స్టోర్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు కంపెనీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ 14 ఉత్పత్తుల ప్రకటనలను ఉపసంహరించుకోవాలని మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఆదేశించినట్లు తెలిపింది.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఉన్నాయన్న కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటోంది. విచారణలో తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధారణ అవ్వడంతో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్, దివ్య ఫార్మసీకి చెందిన 14 రకాల పతంజలి ప్రాడక్టుల తయారీ లైసెన్సులను ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆయుర్వేద సంస్థ ఈ విషయాన్ని సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది.
లైసెన్స్ రద్దు చేయబడిన ప్రొడక్ట్స్
- స్వసారి గోల్డ్
- స్వసారి వాటి
- బ్రోంకోమ్
- స్వసారి ప్రవాహి
- స్వసారి అవలేహ్
- ముక్తావతి ఎక్సట్రా పవర్
- లిపిడమ్
- బీపీ(Bp) గ్రిట్
- మధుగ్రిత్
- మధునాశినీవతి ఎక్సట్రా పవర్
- లివామృత్ అడ్వాన్స్
- లివోగ్రిట్
- ఐగ్రిట్ గోల్డ్
- పతంజలి దృష్టి ఐ డ్రాప్