
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో ఆల్ఫ్రెడ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. 25 లక్షలకు పైగా జనాభా ఉన్న క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. క్వీన్స్‌ల్యాండ్‌లో 2.10 లక్షల ఇండ్లకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూ సౌత్ వేల్స్‌లోనూ 10 వేల ఇండ్లు, పరిశ్రమలకు పవర్ సప్లై నిలిచిపోయింది. 700కి పైగా స్కూళ్లు మూసివేశారు. రోడ్లపై విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. దాంతో ఆ ఏరియాలోని జనమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.