గాలివాన బీభత్సం.. భద్రాద్రి జిల్లాలోనేలకొరిగిన మొక్కజొన్న

గాలివాన బీభత్సం.. భద్రాద్రి జిల్లాలోనేలకొరిగిన మొక్కజొన్న

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలు చోట్ల గాలి దుమారంతో అకాల వర్షం కురిసింది. టేకులపల్లి మండలంలోని పలు చోట్ల మొక్కజొన్న పంట నేలవాలింది.

టేకులపల్లి, గుండాల, ముల్కలపల్లి, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం మండలాలతో పాటు పలు చోట్ల కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడ్డారు.