ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శకదీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు గురుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా నేషనల్ వైడ్ ట్రేండింగ్ గా మారుతోంది. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ALSO READ: లియో మూవీ వివాదం : గ్రూప్ డ్యాన్సర్లకు డబ్బులు ఎగ్గొట్టారంట..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు సంబందించిన కథ పనులు పూర్తయ్యాయట. రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్ కనీవినీ ఎరుగని రీతిలో కథను సిద్ధం చేశారట. ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేశారని సమాచారం. హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు నవంబర్‌లో ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జూన్ ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అంతకంటే ముందు ఈ సినిమా కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకోనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇన్ని ప్రత్యేకతలు మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.