హైదరాబాద్సిటీ, వెలుగు: జనవరి నాటికి మిగిలిపోయిన ఎస్టీపీలను కచ్చితంగా ప్రారంభానికి సిద్ధం చేయాలని మెట్రోవాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తి కాకపోతే జరిమానా విధిస్తామని నిర్మాణ సంస్థలను హెచ్చరించారు. ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.
వాటర్బోర్డు ఎస్టీపీ ప్రాజెక్టుల్లో ఇప్పటికే 11 ఎస్టీపీలు ప్రారంభం కాగా, మరో 9 ఎస్టీపీలు నిర్మాణం దశలో ఉన్నాయన్నారు. వీటిలో డిసెంబర్ లో పాలపిట్ట, వెన్నల గడ్డ ఎస్టీపీలు, జనవరిలో అంబర్ పేట్, ముల్లకత్వ చెరువు, శివాలయ నగర్, నలగండ్ల, అత్తాపూర్, రెయిన్ బో విస్తా, రామ చెరువు దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. సరిపడా కార్మికులను ఎస్టీపీల నిర్మాణానికి కేటాయించాలని, రెండు షిఫ్టుల్లో పనులు జరగాలని సూచించారు.