జైపూర్, వెలుగు: హెచ్ఎంఎస్ పిలుపుతో జైపూర్మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కాంట్రాక్ట్ కార్మికులు శనివారం ప్లాంట్ ఎదురుగా టోకెన్ సమ్మె చేపట్టారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఇతర పవర్ ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్న విధంగా డస్ట్ అలవెన్స్ చెల్లించాలని, భూ నిర్వాసితులను శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఈఎస్ఐ ఆస్పత్రి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎస్టీపీపీ యాజమాన్యం దత్తత తీసుకున్న పెగడపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల న్నారు. హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, ఎస్టీ పీపీ నాయకులు విక్రమ్, సాయి కృష్ణారెడ్డి, అనిల్ రెడ్డి, ఆర్.నరసింహారెడ్డి, సంపత్, హెచ్ఎంఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.