ఎస్టీపీపీకి బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు

  • సింగరేణి సీఎండీతో పాటు ఉద్యోగుల హర్షం 

జైపూర్,వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు అందుకుంది. 3వ జాతీయ పవర్ జనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్ – 2025 లో  భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో అవార్డును ఎస్టీపీపీ డీజీఎం(ఈ అండ్ ఎం) డి. పంతులు అందుకున్నారు.

ఎస్టీపీపీకి అవార్డ్ రావడంపై ఈడీ ఎన్ వీ  రాజశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ  జాతీయస్థాయిలో సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ కేంద్రాల కంటే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.  బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డ్ రావడంపై సింగరేణి  సీఎండీ ఎన్. బలరాం, డైరెక్టర్(ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.