జనాలు డబ్బు ఎక్కువుగా ఎలా సంపాదించాలా.. ఎలా ఉన్నత జీవితాన్ని గడపాలా అని ఆలోచిస్తుంటారు. భారత దేశంలో అధిక జనాభా వ్యవపాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా రైతు వరి పంట వేసేందుకు ఇష్టత చూపుతాడు. ప్రస్తుత పరిస్థితిలో వరి పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ప్రభుత్వాలు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిండంలో విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో ఒడిషాకు చెందిన యువరైతు వరికి బదులుగా స్ట్రాబెర్రీ పంట వేసి లక్షలు సంపాదించాడు.
ఒడిషాలోని నువాపాడా జిల్లాలోని ఓ రైతు స్ట్రా బెర్రీ పంటలో అధిక లాభాలు పొందుతున్నాడు. సునబెడ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ భూమి స్ట్రాబెర్రీ పంటకు అనుకూలంగా ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చుక్తియా భుంజియా కమ్యూనిటికి చెందిన గిరిజన రైతులు (PVTG) నివసిస్తున్నారు. వీరు రెండేళ్ల క్రితం వరకు వరి పంటను సాగు చేసేవారు. కాని వారి జీవన ప్రమాణం అంతంత మాత్రంగానే ఉండేది.
స్ట్రాబెర్రీ సాగు ఎలా మొదలైందంటే....
ఈ ప్రాంతంలో నివసించే 40 ఏళ్ల రైతు కాళీరామ్ 10 మంది రైతులతో కలిసి స్ట్రాబెర్రీ పంటను సాగు చేయడం ప్రారంభించాడు. ఈ పంట సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇక్కడి రైతులు నాలుగు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు స్ట్రాబెర్రీ పంటను సాగు చేస్తున్నారు. .ఇక్కడ వచ్చిన మార్పును గమనించిన ప్రభుత్వం చుక్తియా భుంజియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ (CBDA) ని ఏర్పాటు చేసింది. ఈ ఏజన్సీ స్ట్రాబెర్రీ పంట సాగును కావలసిన సలహాలు.. సూచనలు అందిస్తుంది. CDBA ఏజన్సీ ప్రత్యేక తెగల ప్రజల సంక్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం 1994–95లో ఏర్పాటు చేసింది.
సునబెడ ప్రాంతంలోని పీఠభూమి స్ట్రా బెర్రీ సాగుకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇక్కడి వాతావరణం చల్లగా ఉండటంతో CBDA స్ట్రాబెర్రీ పంటను పండించేందుకు ప్రోత్సహించిందని రైతు కలిరామ్ తెలిపారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో CBDA ఏజన్సీ సంస్థ కలిరామ్ అనే రైతుతో పాటు మరో ఇద్దరిని మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కు తీసుకెళ్లి స్ట్రా బెర్రీ సాగు గురించి వివరిస్తూ.. ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయిన తరువా స్ట్రాబెర్రీ సాగును ప్రారంభించారు.
గతంలో ఇక్కడి రైతులు వరి, మినుము , కూరగాయలు వంటి సాంప్రదాయ వ్యవసాయం చేసేవారు. ఈ పంటలపై వారికి దాదాపు రూ.70-నుంచి 80 వేలు సంపాదించేవారు. CBDA సలహా మేరకు కాళీరామ్ తన సొంత భూమి సాగుకు అనుకూలంగా లేనందున రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. స్ట్రాబెర్రీలను పండించడానికి సాధారణంగా నాలుగు నెలల సమయం పడుతుంది. - రైతులు అక్టోబరులో చెట్లు నాటితే.. జనవరి నాటికి పండ్లు కోతకు సిద్ధంగా ఉన్నాయి. రెండు ఎకరాల్లో స్ట్రా బెర్రీ పంటను సాగు చేసేందుకు లక్ష రూపాయిలు ఖర్చవుతుందని రైతు కాళీరామ్ తెలిపారు. స్ట్రా బెర్రీ పంట ద్వారా మొదటి ఏడాది రూ. 4 లక్షలు ఆదాయం వచ్చినట్టు తెలిపారు. మహాబలేశ్వర్ నుంచి నాణ్యమైన మొక్కలు తీసుకొచ్చేందుకు CBDA సహకరించింది.