న్యూఢిల్లీ:తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్ పవర్‌కు ఎదురులేకుండా పోయింది. ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో జరీన్ గోల్డ్ కైవసం చేసుకుంది. 2019 ఎడిషన్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాదీ ఈ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించింది. ఆమెతో పాటు మరో ఇండియన్ నీతూ కూడా బంగారు పతకం గెలిచింది. బల్గేరియాలోని సోఫియాలో ఆదివారం జరిగిన 52 కేజీ కేటగిరీ ఫైనల్లో నిఖత్ 4–1తో ఉక్రెయిన్‌కు చెందిన తెటియానా కోబ్‌ను ఓడించింది. సెమీస్‌లో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌పై నెగ్గి ఆత్మవిశ్వాసం పెంచుకున్న నిఖత్‌కు తుదిపోరులో తెటియానా నుంచి సవాల్ ఎదురైంది. యూరోపియన్ చాంపియన్‌షిప్స్‌లో మూడుసార్లు మెడలిస్ట్ అయిన ఉక్రెయిన్ బాక్సర్, హైదరాబాదీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఆటలో పైచేయి సాధించేందుకు ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. పక్కా డిఫెన్స్‌తో ఆడిన తెటియానా ఎక్కువ అవకాశం ఇవ్వకపోయినప్పటికీ.. నిఖత్ క్లియర్ పంచ్‌లు కొట్టి బౌట్‌లో గెలిచింది. మరోవైపు విమెన్స్ 48 కేజీ ఫైనల్ బౌట్‌లో నీతూ 5–0తో ఇటలీకి చెందిన ఎరికా ప్రిసియాండ్రోను చిత్తు చేసింది. మొదటి నుంచి కౌంటర్ ఎటాక్ చేసిన నీతూ.. ఎరికాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలిచింది. సెమీస్‌లో ఓడిన నందిని (+81 కేజీ) బ్రాంజ్ నెగ్గడంతో ఈ టోర్నీలో ఇండియా మొత్తంగా మూడు పతకాలు సాధించింది.
స్ట్రాంజాలో మళ్లీ గోల్డ్ నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు నన్ను స్ట్రాంజా క్వీన్ అనొచ్చు. రెండింటిలో ఇదే నాకు చాలా స్పెషల్. మెడల్ ఎందుకంటే సెమీస్‌లో ఒలింపిక్ మెడలిస్ట్‌పై గెలిచా. ఈ ఏడాది జరిగే మూడు మేజర్ టోర్నీలైన వరల్డ్ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌కు ముందు ఈ విక్టరీ నా కాన్ఫిడెన్స్‌ను పెంచింది.
‑ నిఖత్ జరీన్