న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ ఐడియాలు, లీడర్‌షిప్‌పై ప్రముఖ జర్నలిస్ట్, రచయిత సుగత శ్రీనివాస రాజు ఓ బుక్ తీసుకొస్తున్నారని పబ్లిషింగ్ హౌస్ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ (పీఆర్‌హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 28న ఈ బుక్ రిలీజ్ చేయడానికి రచయిత సిద్ధమవుతున్నారని తెలిపింది.
ALSO READ :మీడియా అకాడమీ బిల్డింగ్ రెడీ.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్
2004, మార్చిలో రాహుల్ గాంధీ అధికారికంగా రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి 2023, జనవరిలో పూర్తయిన భారత్ జోడో యాత్ర వరకు అన్ని అంశాలను ఇందులో ప్రస్తావించారని తెలిపింది. ‘స్ట్రేంజ్ బర్డెన్స్ : ది పాలిటిక్స్ అండ్ ప్రిడికామెంట్స్ ఆఫ్ రాహుల్ గాంధీ” పేరుతో ఈ బుక్ వస్తున్నదని వెల్లడించింది. రాహుల్ ఆలోచనలు, లీడర్షిప్, కారణాలు, ఎమోషన్స్‌ను రచయిత విశ్లేషించారని వివరించింది.