అర్థరాత్రి గంటలో 3 భూకంపాలు.. అది కూడా సముద్రంలో.. కంపించిన భూమి

అర్థరాత్రి గంటలో 3 భూకంపాలు.. అది కూడా సముద్రంలో.. కంపించిన భూమి

గంట వ్యవధిలోనే ఏకంగా 3 భూ ప్రకంపనలు వచ్చాయి.  ఫిబ్రవరి 8 ఉదయం  4 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల 28 నిమిషాల లోపు అరేబియా సముద్ర తీరంలో మూడు భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ  తెలిపింది.  భూకంపాలు వరుసగా.. రిక్టర్  స్కేలుపై 4.3, 4.6 ,4.7 తీవ్రతతో నమోదయ్యాయి. 

కేరళలోని ఉత్తర కాసరగోడ్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలలో ఫిబ్రవరి 8న శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. కేరళలోని  కాసరగోడ్ జిల్లాలోని వెల్లరికుండు కొండ తాలూకాలోని కల్లార్, కోడోం-బేలూర్, కినానూర్-కరింతలం, బాలల్ మరియు వెస్ట్ ఎలేరి గ్రామ పంచాయతీల నుండి భూకంపం వచ్చినట్లు వెల్లరిక్కుండు తహశీల్దార్  మురళి తెలిపారు. నేను నా గదిలో ఉన్నప్పుడు  మా అమ్మ ఒక పెద్ద వింత శబ్దం విని నన్ను పిలిచిందని ఆయన అన్నారు. కొంతసేపటికే, చాలా మంది నాకు ఫోన్ చేసి భూమి కొద్దిసేపు కంపించినట్లు చెప్పారని ఆయన అన్నారు.కొంతమంది తమ ఫోన్లు టేబుళ్లపై నుండి పడిపోయాయని, ప్రకంపనల కారణంగా తమ బెడ్లు కదిలాయని చెప్పారు.

ALSO READ | ఇక పెళ్లిళ్లు అయినట్లే : సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి రద్దు చేసుకున్న అమ్మాయి

అయితే  ఫిబ్రవరి 8న  ఉదయం 4.30 నుంచి 5.28 గంటల మధ్య అరేబియా సముద్ర తీరంలో మూడు భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే   లక్ష్యద్వీప్ తీరంలో ప్రకంపనలు సంభవించాయని ,దక్షిణ ద్వీపకల్పంలో భూభాగంలో ఎటువంటి  భూకంపం రాలేదని కేరళ అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. కేరళ భూభాగంలో ఎక్కడా భూకంపం  రాలేదు.  లక్షద్వీప్ తీరంలో నమోదైన ప్రకంపనల కారణంగా శబ్దాలు రావొచ్చని  అని ఒక అధికారి తెలిపారు.