మొన్న కాంగ్రెస్​లో.. నిన్న బీఆర్ఎస్​లో..

  • ఎన్నికల వేళ రోజురోజుకూ మారుతున్న కండువాలు

లక్సెట్టిపేట, వెలుగు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో కార్యకర్తల భుజాలపై పార్టీల కండువాలు మారుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మేరు సంఘం అధ్యక్షుడు రామగిరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెన్న వెంకటస్వామి, కార్యవర్గ సభ్యుడు రాజేశ్​తో పాటు పలువురు లీడర్లు మంగళవారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALS0 READ: తప్పుడు ప్రచారం మానుకోవాలి : క్యామ మల్లయ్య

అయితే, వీరంతా బుధవారం ఉదయం మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్​నేతలు బుధవారమే వెన్న వెంకటస్వామి ఇంటికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పడం విశేషం.