వింత ఆచారం..చీపుర్లు..చాటలతో..

వింత ఆచారం..చీపుర్లు..చాటలతో..

దేశంలో అనేక ప్రాంతాల్లో అరుదైన ఆచారాలు, వైవిధ్యమైన సంప్రదాయాలు పాటిస్తుంటారు. అదే రీతిలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దామరాజు పల్లి గ్రామంలో వింత ఆచారాన్ని గ్రామస్తులు పాటిస్తున్నారు. 

 పాత దామరాజు పల్లిలో ఊరికి సోకిన కీడును (జెట్టక్క)ను పొలిమేర వరకు దాటించేందుకు ప్రజలు చీపర్లు, చేటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.  గ్రామస్తులంతా ఒకరినొకరు చీపుర్లతో కొట్టుకుంటూ గ్రామ పొలిమేరకు వెళ్లి అక్కడ వాటిని పారవేయడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రతీ ఏడాది ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. 

గ్రామానికి పట్టిన కీడును జెట్టక్క అని పీల్చుకుంటారు. అందుకే ఊరికి ఈ పీడను ..కీడును పారద్రోలేందుకు ఇక్కడి  ప్రజలు ఎన్నోఏళ్లుగా ఈ  వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రతీ ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఈ తంతు నిర్వహిస్తున్నారు.