కొడితే ఎండ లేదా వాన.. హైదరాబాద్‎లో వాతావరణ అనుహ్య మార్పులకు కారణం ఇదే..!

కొడితే ఎండ లేదా వాన.. హైదరాబాద్‎లో వాతావరణ అనుహ్య మార్పులకు కారణం ఇదే..!

హైదరాబాద్ మహానగరంలో వాతావరణంలో అనుహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం అంతా ఎండ, ఉక్క పోతగా ఉండగా.. మధ్యాహ్ననికి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకున్న క్యుమిలోనింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ (అక్టోబర్ 3) అక్కడక్కడ వర్షం కురిసింది. 

అయితే, వాతావరణంలోని ఈ అనుహ్య మార్పులకు నైరుతీ రుతుపవనాల తిరోగమనం, ఈశాన్య రుతుపవనాల ఆగమనమే కారణమని.. అందువల్లే నిమిషాల్లోనే వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ వాయువ్య దిశల నుండి వీస్తున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ALSO READ | వెదర్ వర్రీ: అప్పటి వరకు ఎండ.. అప్పటికప్పుడు జోరు వాన.. ఇబ్బందుల్లో జనం

ఇవాళ (అక్టోబర్ 3) రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు (అక్టోబర్ 4) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

ఎల్లుండి (అక్టోబర్ 5)  నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్‎లో నిమిషాల్లోనే వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనుహ్య మార్పులతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కొడితే ఎండ లేదా వాన అన్నట్లుగా నగరంలో పరిస్థితి మారడంతో ఇబ్బంది పడుతున్నారు.