
హైదరాబాద్: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్థరాత్రి అగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. జూబ్లీహిల్స్లోని డీకే అరుణ నివాసంలోకి ముసుగు గ్లౌజులు ధరించి దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం, ఇంట్లో కిచెన్, హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. గంటన్నర పాటు ఇంట్లో తిరిగాడు.
అయితే, దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, అగంతకుడు తన ఇంట్లోకి చొరబడిన ఘటనపై డీకే అరుణ స్పందించారు. తనకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనపై డీకే అరుణ ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మణ్ ఏమన్నాడంటే..
* నిన్న రాత్రి మేము 5 గురు పని మనుషులం ఇక్కడే ఉన్నాం
* 3:57am గంటలకు దుండగుడు ఎంటర్ అయ్యాడు
* ఉదయం 5 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు
* ఇంట్లో మేడం బెడ్ రూం వరకు వెళ్ళాడు.. లాక్ వేయడంతో తిరిగి వెళ్ళాడు
* సీఎం రేవంత్ ఇంటి దగ్గరలో మేడం ఇల్లు ఉన్నా ఇలా జరగడం భయంగా ఉంది
* ఏ ఒక్క వస్తువు తీసుకెళ్ళలేదు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం
* పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించి తీసుకెళ్లారు
* డీకే అరుణ మేడం నివాసానికి దాదాపు 20 సీసీ కెమెరాలు ఉన్నాయి
* మూడు కెమెరాలను అగంతకుడు ఆఫ్ చేశాడు.. ఒకదాని వైర్ కట్ చేశాడు
* పూజ గదిలోకి వెళ్ళాడు.. గది మొత్తం తిరిగాడు
* మాస్క్ ధరించి లోనికి ప్రవేశించాడు
* పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు