ఈ మధ్య సైక్లింగ్ చేయడాన్ని చాలామంది అలవాటుగా మార్చుకుంటున్నారు. అలాంటివాళ్లకు వాటిని కాపాడుకోవడం, మెయింటెన్ చేయడం పెద్ద టాస్కే. కొన్ని గాడ్జెట్స్‌ని వాడితే ఆ టాస్క్ కాస్త ఈజీ అవుతుంది. అలాంటివాటిలో కొన్ని గాడ్జెట్స్..
తేలికగా ఉండడం వల్ల సైకిళ్లకు లాక్ వేసినా ఈజీగా ఎత్తుకెళ్తుంటారు. కాబట్టి ఇలాంటి వైర్లెస్ వైబ్రేషన్ అలారం పెట్టుకుంటే సైకిల్‌ను దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు. స్ట్రవుస్ అనే కంపెనీ వీటిని మార్కెట్లోకి తెచ్చింది. దీన్ని సైకిల్ సీటు కింది భాగంలో ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో వైబ్రేటింగ్ సెన్సర్ సిస్టమ్ ఉంటుంది. అందువల్ల సైకిల్ షేక్ లేదా వైబ్రేట్ అయినప్పుడు 20 సెకన్ల పాటు అల్ట్రా స్ట్రాంగ్ అలారం వస్తుంది.
అంటే ఎవరైనా సైకిల్ని కదిలిస్తే అలారం మోగుతుంది. దీన్ని ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తో ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. ప్యాకేజీలో దీంతోపాటు వచ్చే రిమోట్10 మీటర్ల దూరం నుంచి కూడా పనిచేస్తుంది. ఈ గాడ్జెట్‌లో 9 వోల్ట్స్ బ్యాటరీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. రిమోట్లో ఒక ఎల్828 బ్యాటరీ వేస్తే సరిపోతుంది.
ధర : 559 రూపాయలు