శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా బొమ్మరాశిపేటలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒకేరోజు ఏడుగురిపై ఓ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి అక్షితకు తీవ్ర గాయాలయ్యాయి. నరసింహ అనే వ్యక్తి ఇంటి ముందు నిల్చొని ఉండగా కుక్క దాడికి పాల్పడింది. జగన్ కూడ గ్రామానికి చెందిన రోజువారి కూలీ సెంట్రింగ్పని నిమిత్తం శుక్రవారం బొమ్మరాసిపేటకు వచ్చాడు.
మధ్యాహ్న సమయంలో అన్నం తింటుండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. వీరితోపాటు మరో ముగ్గురు కుక్క దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. అయితే రేబిస్ఇంజక్షన్లు అందుబాటులో లేకపోవడంతో శామీర్‌పేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు బాధితులను నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గత మూడు రోజుల్లో 20 మందికి పైగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డారని చెప్పారు.