చిన్నారులపై వీధి కుక్కల దాడి

  • చిన్నారులపై వీధి కుక్కల దాడి

ఇల్లెందు,వెలుగు:  వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు, ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం  పట్టణంలోని 23వార్డులో   చింత కీర్తన, ముస్కాన్ అనే చిన్నారులు స్కూల్​కు వెళ్లేందుకు స్కూల్ బస్​స్టాప్ వద్ద నిలుచున్నారు. అక్కడ గుంపుగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా వారి మీద పడి విచక్షణా రహితంగా దాడి చేశాయి. స్థానికులు కుక్కలను చెదరగొట్టి పిల్లల్ని కాపాడారు.  

ALSO READ: జిమ్లో గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి

చిన్నారులకు  తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే 22వ వార్డు లోని హరిజన బస్తీకి చెందిన ఉసికల చంద్రయ్య అనే వృద్ధుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల బెడద నుంచి కాపాడాలని   మున్సిపల్ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.  హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న  బాధితులను  మున్సిపల్​ చైర్మన్  వెంకటేశ్వర్లు పరామర్శించారు.