వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణం జరిగింది. గండు సాయమ్మ అనే 85 ఏళ్ళ వృద్ధురాలిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్క దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.నోరు, ముక్కు, కాళ్ళపై కుక్క విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.
కుక్క దాడి చేసే సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రతిఘటించలేకపోయిన వృద్ధురాలు అచేతన స్థితిలో ఉండిపోయింది.కొద్ది సేపటి తర్వాత కుక్క దాడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.