చిన్నారులపై వీధి కుక్కల దాడి

చిన్నారులపై  వీధి కుక్కల దాడి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్  మండలం అంకోలి గ్రామంలో చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. మంగళవారం నవనీత్, అపర్ణ, అర్చనపై వేర్వేరుగా కుక్కలు దాడి చేశాయి. దీంతో ముఖం, చేతులకు గాయాలయ్యాయి. అపర్ణకు కన్ను దగ్గర గాయమైంది. వారిని వెంటనే రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.