సిద్దిపేటలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

సిద్దిపేటలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

సిద్దిపేట జిల్లాలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. మిరుదొడ్డి మండలం బేగంపేట గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి హన్షితపై దాడి చేయడంతో.. తీవ్రగాయాలయ్యాయి. 

తల్లిదండ్రులు హన్షితను సిద్ధిపేట ఏరియా హాస్పిటల్ కు తరలించి వైద్యమందిస్తున్నారు. అధికారులు వీధి కుక్కల బెడదను అరికట్టాలని డిమాండ్ చేశారు స్థానికులు.