సూర్యాపేట జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ప్రజలపై దాడి చేస్తూ భయభ్రంతులకు గురి చేస్తున్నాయి. శ్రీరాంనగర్ కాలనీలోలో ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చికిత్స మహిళను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.
శ్రీరాం నగర్ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కుక్కుల భయానికి వీధిలో తిరిగేందుకు స్థానికులు భయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను స్కూళ్లకు పంపించాలన్నా వీధి కుక్కల భయంతో జంకుతున్నారు.
స్థానికంగా ఉన్న అంగన్ వాడీ సెంటర్ సమీపంలో దాదాపు 20 కుక్కలు ఉన్నాయి.. కుక్కల భయంతో ఎవ్వరూ పిల్లలను అంగన్ వాడీ సెంటర్ కు పంపించడం లేదని అంగన్ వాడీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళపై కుక్కల దాడి చేయడంతో మరింత ఆందోళనకు గురి అవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.