కరీంనగర్ జిల్లా : హుజూరాబాద్ పట్టణంలో పలు కాలనీల్లో వీధి కుక్కల స్వైర విహారం. చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటేనే జనం భయంతో వణుకుతున్నారు. కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ పట్టణంలో బుధవారం 22 మందికి పై వీధి కుక్కలు దాడి చేశాయి.
విద్యానగర్ గాంధీనగర్, ప్రతపావాడ, మామిండ్లవాడ కాలనీల్లో దాదాపు 20 మంది పైగా పిచ్చి కుక్కల దాడిలో గాయాలపాలైయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణంలోని ఎంజిఎం హాస్పిటల్ కు తరలించారు. ప్రభుత్వ అధికారులు చొరువ తీసుకొని వీధి కుక్కల బెడద నివారించాలని ప్రజలకు కోరుతున్నారు. చిన్న పిల్లలతోపాటు పెద్దలపై కూడా శునకాలు దాడి చేస్తున్నాయి.