దారుణం : చిన్న పిల్లల్ని తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్కలు

దారుణం : చిన్న పిల్లల్ని తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్కలు

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఒకే గ్రామంలోని ముగ్గురు చిన్నారులను వీధి కుక్కలు వేరువేరు చోట తీవ్రంగా గాయపరిచాయి. క్కుక్కల దాటికి పిల్లల పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలోని వేరువేరు చోట్ల ముగ్గురు చిన్న పిల్లలపై దాడి చేశాయి.

 కుక్కల దాటికి ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం మారింది. గాయలైన పిల్లలను హుటాహుటిన గోదావరిఖనిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో కరీంనగర్ లో ఆస్పత్రికి తరలించారు.