
ఇయ్యాల, రేపు వెబ్ కౌన్సెలింగ్
వరంగల్సిటీ, వెలుగు : ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఈ నెల 22, 23వ తేదీన వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ట్రే వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించారు.
అయితే, ఇంకా మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు స్ట్రే వేకెన్సీ రౌండ్ చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని వర్సిటీ అధికారులు తెలిపారు.