
టైటిల్ : ది రౌండప్ : నో వే ఔట్
డైరెక్షన్ : లీ సాంగ్-యోంగ్
కాస్ట్ : మా డాంగ్-సియోక్, లీ జూన్-హ్యూక్, మునెతక అయోకి, జున్ కునిమురా, లీ బీమ్-సూ, కిమ్ మిన్-జే, జున్ సుక్-హో, కో క్యు-ఫిల్, బే నూ-రి, లీ జి-హూన్
లాంగ్వేజ్ : కొరియన్ (తెలుగు)
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
దక్షిణ కొరియా యాక్షన్ స్టార్ మా డియోంగ్-సియోక్ హీరోగా వచ్చిన ‘‘ది ఔట్‌లాస్” యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. దానికి సీక్వెల్‌గా ‘‘ది రౌండప్” వచ్చింది. ఇది కొరియన్ గ్యాంగ్‌స్టర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా. పోయినేడాది వచ్చిన ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అయ్యింది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ది రౌండప్ : నో వే ఔట్’ వచ్చింది. కథలోకి వెళ్తే.. మా డాంగ్-సియోక్ ఒక పోలీస్ ఆఫీసర్. జపాన్‌కు చెందిన యాకూజా దొంగ కొరియన్ పార్ట్నర్స్ వైట్ షార్క్ క్లాన్ నుండి హైపర్ అనే డ్రగ్‌ని దొంగిలించే క్రమంలో హిట్‌మ్యాన్ రికీ (మునెటకా అయోకి ) అనే అమ్మాయిని చంపుతాడు.
అయితే.. ఈ మర్డర్ కేసును హీరో సాల్వ్ చేయాల్సి వస్తుంది. విషయం తెలుసుకున్న హీరో హైపర్ డ్రగ్ అమ్మకాలను ఆపేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? హీరో వాళ్లను ఎలా పట్టుకున్నాడు? అనేది మిగతా కథ. సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీ బాగుంది. ట్విస్ట్‌లు బాగున్నాయి.