
టైటిల్ : పార్థుడు
డైరెక్షన్ : కన్నన్ తామరైకులం
కాస్ట్ : ప్రకాశ్ రాజ్, అనూప్ మీనన్, సన్నీ వేన్, సురేశ్ కృష్ణ, శంకర్ రామకృష్ణన్
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్ ఫాం : ఈటీవీ విన్
అచ్యుతన్ నాయర్ (ప్రకాశ్ రాజ్) వరుసగా రెండుసార్లు కేరళకు ముఖ్యమంత్రిగా ఎన్నికవుతాడు. మరోసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు రెడీ అవుతాడు. మూడోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తాడు. కానీ, యువతకు కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ హైకమాండ్ డేవిడ్ జాన్ (అనూప్ మేనన్)ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుంది. అతను ఒక బిజినెస్ మ్యాన్. అయితే.. డేవిడ్ ఎంపికను చాలామంది వ్యతిరేకిస్తారు. అదే టైంలో అతను కిడ్నాప్ అవుతాడు.
తర్వాత ఏం జరిగింది? అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రకాశ్‌రాజ్, అనూప్ మేనన్.. లీడ్ రోల్స్ మలయాళంలో వరాల్ పేరుతో వచ్చిన సినిమాను ఓటీటీలో తెలుగులో రిలీజ్ చేశారు. ప్రకాశ్‌రాజ్, అనూప్ ఇద్దరూ బాగా నటించారు. సినిమాలో ఎక్కువ సేపు కనిపించకపోయినా ప్రకాశ్‌రాజ్ ఆకట్టుకున్నాడు.