DoorPlay App : రూ 399కే 20కి పైగా ఓటీటీ యాప్స్

DoorPlay App : రూ 399కే 20కి పైగా ఓటీటీ యాప్స్

స్మార్ట్​ టీవీ కోసం వైఫై బేస్డ్​ ఎంటర్​టైన్​మెంట్ సర్వీస్​లు తీసుకొచ్చిన స్ట్రీమ్ బాక్స్ మీడియా, ఇప్పుడు డోర్​ ప్లే పేరుతో సరికొత్త యాప్​ తీసుకొచ్చింది. ఇది పూర్తిగా ఎంటర్​టైన్​మెంట్ యాప్.ఈ యాప్​ ఉంటే ఓటీటీ కోసం సబ్​స్క్రిప్షన్​ తీసుకునే అవసరం ఉండదు. ఎందుకంటే ఓటీటీలను ఒకేచోట అందిస్తుంది ఈ యాప్​. దీంతో ఒక్క సబ్​స్క్రిప్షన్​ తీసుకుంటే 20కి పైగా ఓటీటీ, 300కు పైగా లైవ్​ టీవీ సర్వీస్​లు పొందొచ్చు. అందుకోసం మూడు నెలలకు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్​ని గూగుల్ ప్లే స్టోర్​ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్​ సబ్​స్ర్కిప్షన్​ను ఫ్లిప్​కార్ట్​ ద్వారా ఆఫర్ చేస్తోంది. 

సబ్​స్క్రిప్షన్​ని  యాక్టివేట్ చేయాలంటే యాప్​ డౌన్​లోడ్ చేసి, కూపన్​ కోడ్ ఎంటర్ చేయాలి. ఈ యాప్​తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, సోనీలివ్, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్​, డాలీవుడ్ ప్లే, డిస్కవరీ ప్లస్, ఫ్యాన్ కోడ్, షెమారు మీ, ఈటీవీ విన్​, చౌపాల్, స్టేజ్, ట్రావెల్ ఎక్స్​పీ, నమ్మఫిక్స్, ఆహా, రాజ్ డిజిటల్, ప్లే ఫ్లిక్స్, డిస్ట్రో టీవీ, మనోరమ, వీఆర్ ఓటీటీ, ఓటీటీ ప్లస్ వంటివి ఈ యాప్​లో ఉంటాయి. అయితే ఇది కేవలం మొబైల్ ఫోన్​లలో మాత్రమే పనిచేస్తుంది. టీవీ లేదా ల్యాప్​ట్యాప్​లలో పనిచేయదని కంపెనీ తెలిపింది.