శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన స్త్రీ 2 (Stree 2) మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. ఆగస్ట్ 15న రిలీజైన ఈ మూవీ..థియేటర్లోకి వచ్చి ఐదు వారాలు కావొస్తున్న వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే..పెద్దగా స్టార్లు లేకుండానే కేవలం కథనే నమ్ముకొని ఈ మూవీ సాధించిన ఈ రికార్డు నిజంగా ఎవరూ ఊహించనిదే.
అయితే..స్త్రీ –2’ సినిమా మరో రికార్డు సాధించింది. కలెక్షన్ల పరంగా యానిమల్ సినిమాను దాటేసింది. బాలీవుడ్ నటీనటులు శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ఈ మూవీ కామెడీ హారర్ ఫిల్మ్ గా ఆగస్టు 15న ప్రేక్షకుల ముుందుకువచ్చింది. సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వవం వహించారు.
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తతంగా భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. యానిమల్ సినిమా బాలీవుడ్ లో రూ. 553 కోట్లను వసూలు చేసింది.
Also Read :- ఓటీటీలకే సెన్సార్ బోర్డు ఎక్కువ అవసరం
తాజాగా ‘స్త్రీ –2’ మూవీ బాలీవుడ్ లో రూ.586 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాగా ‘స్త్రీ –2’ నిలిచింది. రూ.582 కోట్లతో షారుక్ ఖాన్ నటించిన జవాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడా రికార్డును స్త్రీ 2 రూ.586 కోట్లతో బ్రేక్ చేసింది. గదర్ 2 (రూ.526 కోట్లు), పఠాన్ (రూ.524 కోట్లు), యానిమల్ (రూ.503 కోట్లు), దంగల్ (రూ.387) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
#Stree2 scripts HISTORY... Becomes the HIGHEST-GROSSING *HINDI* FILM EVER... Crosses *lifetime biz* of #Jawan [#Hindi version]... Next stop: Inaugurating the ₹ 600 cr Club.
— taran adarsh (@taran_adarsh) September 18, 2024
[Week 5] Fri 3.60 cr, Sat 5.55 cr, Sun 6.85 cr, Mon 3.17 cr, Tue 2.65 cr. Total: ₹ 586 cr. #India biz.… pic.twitter.com/b5KtiIuZYZ
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. మంగళవారం (సెప్టెంబర్ 17) వరకు చూసుకుంటే స్త్రీ 2 కలెక్షన్లు ఇండియాలోనే రూ.586 కోట్లకు చేరాయి. రూ.100 కోట్లలోపు బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. పెద్ద పెద్ద హిందీ సినిమాలను వెనక్కి నెట్టడం విశేషం. 2018లో వచ్చిన 'స్త్రీ' మూవీకి ఇది సీక్వెల్. స్త్రీ పార్ట్ 1 రూ.100 కోట్లు సాధించింది.