వీధుల్లో తిరిగే కుక్కకు విమానయోగం పట్టింది. భారతదేశం నుంచి నెదర్లాండ్స్కు ఎగిరిపోనుంది. అక్కడ 6 నెలల పాటు ఎంజాయ్ చేయబోతుంది. వీధి కుక్క నెదర్లాండ్స్ ఎలా వెళ్తుంది...? వీసా, పాస్ పోర్ట్ ఎలా మరి అనుకుంటున్నారా..? ఆ వివరాలు చూద్దాం.
కుక్కకు వీసా..పాస్ట్ పోర్టు..
నెదర్లాండ్స్కు చెందిన మెరల్ బొటెన్ బల్ అనే మహిళ ఇటీవలె వారణాసి వచ్చింది. అక్కడ జయ అనే వీధి కుక్కను చూసి ముచ్చటపడింది. ఆ శునకంతో స్నేహం చేసింది. అయితే జయను విడిచి పెట్టి నెదర్లాండ్స్ వెళ్లలేకపోయింది. దీంతో జయను తనతో పాటు నెదర్లాండ్స్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం పాస్ పోర్టు ఆఫీసును సందర్శించి..అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపింది. కుక్కకు పాస్ పోర్టు, వీసా రావడానికి 6 నెలలు టైం పడుతుందని అధికారులు చెప్పారు. దీంతో మెరల్ బొటెన్ కూడా..కుక్క కోసం ఇక్కడే 6 నెలలు ఉండిపోయింది. ఎట్టకేలకు జయకు పాస్ పోర్ట్, వీసా మంజూరైంది. దీంతో త్వరలోనే బొటెన్ బల్..జయను నెదర్లాండ్స్కు తీసుకెళ్లనుంది.
#WATCH | Varanasi, Uttar Pradesh: A female street dog named Jaya from Varanasi is set to leave India with a proper visa and passport with her new owner from the Netherlands. pic.twitter.com/i57rMJqyjb
— ANI (@ANI) October 26, 2023
కుక్కలంటే ఇష్టం..
తనకు కుక్కలంటే ఇష్టమని..జయ అనే వీధి కుక్కను చూసినప్పుడే అది తన మనసును గెలుచుకుందని మెరల్ బొటెన్ బల్ ట్విట్టర్లో తెలిపారు. . జయను తనతో పాటు తీసుకెళ్లేందుకు అన్ని సిద్దం చేసుకున్నట్లు చెప్పారు.